Himanshu : సోషల్ మీడియాలో హిమాన్షు పాట వైరల్, గర్వంగా ఫీల్ అవుతున్న కేటీఆర్..!! - MicTv.in - Telugu News
mictv telugu

Himanshu : సోషల్ మీడియాలో హిమాన్షు పాట వైరల్, గర్వంగా ఫీల్ అవుతున్న కేటీఆర్..!!

February 18, 2023

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిమాన్షు మొదటిసారిగా పాడిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను పాడిన ఇంగ్లీష్ పాటను యూట్యూబ్ తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో హిమాన్షు షేర్ చేశాడు. ఫేమస్ ఇంగ్లీష్ సాంగ్ గోల్డెన్ అవర్ పాటకు కవర్ సాంగ్ ను హిమాన్షు పాడారు. ఈ పాటను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. తన కుమారుడు పాడిన పాట తనకు ఎంతో నచ్చిందని..మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హిమాన్షు పాట గురించి ఎమ్మెల్సీ కవిత కూడా ట్వీట్ చేశారు. నిన్న చూసి గర్వపడుతున్నాను అల్లుడూ…అంటూ ట్వీట్ చేశారు. మరిన్ని మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను. దైవానుగ్రహం నీపై ఉండాలని అంటూ పేర్కొన్నారు.