The staff beat hero Chandan Kumar in shooting set
mictv telugu

సెట్‌లో సిబ్బందితో తన్నులు తిన్న హీరో.. వీడియో ఇదిగో

August 1, 2022

నోరు జారిన హీరో, సీరియల్ నటుడిపై సిబ్బంది చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన చందన్ కుమార్.. ప్రస్తుతం తెలుగులో శ్రీమతి శ్రీనివాస్ సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన షూటింగ్‌లో చందన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. అంతేకాక ఓ టెక్నీషియన్‌ను నానాబూతులు తిడుతూ దుర్భాషలాడాడు. దాంతో కోపగించుకున్న అక్కడి సిబ్బంది ఆవేశంతో చేయి చేసుకున్నారు. తన తల్లిని దూషించాడంటూ ఓ టెక్నీషియన్ హీరో చెంప ఛెల్లుమనిపించాడు. తర్వాత మాటల దాడి చేయగా, మిగతావారు జోక్యం చేసుకొని చందన్‌తో సిబ్బందికి క్షమాపణలు చెప్పించారు. కాగా, చందన్ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్‌తో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు. కన్నడలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యతో కలిసి ప్రేమ బరహా చిత్రంలో నటించాడు.

https://www.sakshi.com/telugu-news/movies/kannada-actor-chandan-kumar-attacked-crew-over-his-misbehaviour-set-1475181