బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్‌కు సంబంధించిన ఓ తాజా వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. హృతిక్ రోషన్‌తో విడాకులు తీసుకున్న ఆమె..ఇప్పటివరకూ తన ప్రియుడు అర్స్లాన్ గోనీతో రిలేషన్ షిప్‌ను రహస్యంగా కొనసాగిస్తూ, వచ్చింది. తాజాగా వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవటంతో సంచలనంగా మారింది. అయితే, తమ రిలేషన్ షిప్లో ఇప్పటివరకూ ఎలాంటి మనస్పర్థలు రాలేదని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని సుసానే ఖాన్ పరోక్షంగా హింట్ ఇచ్చింది.
దీంతో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. హృతిక్ రోషన్‌తో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె..ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏమౌతుందని ఆగ్రహిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ నటి, సింగర్ సాబా అజాద్‌తో హృతిక్ రోషన్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుసానే, ఆమె బోయ్ ఫ్రెండ్ తమ మ్యారేజ్‌ను చాలా సింపుల్‌గా చేసుకోబోతున్నారని ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
ఇక, హృతిక్ రోషన్, సుసానేలు 14 ఏళ్లపాటు వైవాహిక జీవితం కొనసాగించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ..పిల్లలతో మాత్రం అప్పుడప్పుడు సమయాన్ని కలిపి గడుపుతుంటారు. గతంతో హృతిక్ రోషన్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో వివాదం నడుస్తున్న సమయంలో సుసానే తన మాజీ భర్తకు అండగా నిలబడింది.