టాలీవుడ్ నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన హిమజ.. సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బుల్లితెరకు గుడ్‌బై చెప్పి, వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది. దీంతో హిమజ వరుసగా సినిమాల్లో హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్ పాత్రల్లో నటించింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లో తన నటనతో మురిపించి మరింత పాపులర్ అయ్యింది.
అయితే, తాజాగా తాటిరేకులో కల్లు తాగిన ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఫోటోపై ఆమె అభిమానులు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. కల్లు అంత తాగాక, కల్లు చాలా అద్భుతంగా ఉందంటూ ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా అరబిక్ కుతు సాంగ్‌ను ఈ వీడియోకు యాడ్ చేసి, తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.