the-story-of-the-worlds-most-expensive-rose
mictv telugu

ఈ గులాబీని కొనాలంటే ఒక జీవితం సరిపోదు

February 14, 2023

 the-story-of-the-worlds-most-expensive-rose

మనకు చాలా రకాల పువ్వులున్నాయి. ఏ పువ్వు అయినా అందంగానే ఉంటుంది. కానీ అన్నింటిలో కన్నా స్పెషల్ పువ్వు మాత్రం గులాబీనే. అందానికే వన్నె తెచ్చే గులాబీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్నింటికన్నా ఎవరికైనా పువ్వులు ఇవ్వాలనుకుంటే ముందు గుర్తొచ్చేది గులాబీ. అందులో ప్రేమికులకు అయితే ఈ పువ్వు తప్ప మరొకటి కనిపించదు. ప్రేమ కురిపించాలన్నా, చాటాలన్నా రోజ్ లతోనే చేస్తారు. రోజాపూల ప్రేమ ఇప్పటిది కాదు….ఎప్పుడో బీసీ కాలంలోనే మొదలైందిట.

ముందే చెప్పుకున్నాం కదా…పువ్వు్లో రాణి గులాబీకి చాలా ప్రత్యేకతలున్నయని. ఇది రోసా అనే జాతికి చెందినది. గులాబీ వాసన కూడా చాలా బావుంటుంది. అందుకే దీని నీళ్ళు, నూనె చాలా వాటిల్లో ఉపయోగిస్తారు. రోజ్ లలో 300లకు పైగా జాతులున్నాయి. వాటిల్లో ఒక్కో పువ్వు బట్టి ఒక్కో రకం ధర కూడా ఉంటుంది. అయితే అన్నింటికన్నా ఒక గులాబీ మాత్రం పిచ్చ కాస్టలీ అంట. దాని ప్రైస్ వింటే షాక్ అవ్వాల్సిందే.

జూలియెట్ రోజ్….ఇదే అన్నింటికన్నా కాస్ట్లీ గులాబీ. దీని ధర 112 కోట్లు. ఎహే టూ మచ్ గా మాట్లాడకండి. ఒక పువ్వు కాస్ట్ 112 కోట్లు ఏంటి అనుకుంటున్నారు కదూ. కానీ అదే నిజం. అసలు ఇది పుయ్యడానికే 15 ఏళ్ళు పడుతుందిట. దీన్ని 2006లో కనుగొన్నారు. డేవిడ్ ఆస్టిన్ అనే వ్యక్తి ఈ ఖరీదైన గులాబీని కనుగొన్నారు. చాలా రకాల గులాబీలన్నింటినీ కలిపి పెంచితే ఈ గులాబీ వస్తుంది. దీని శాస్త్రీయ నామం ఆప్రికాట్ హ్యూడ్ హైబ్రీడ్. డేవిడ్ పూయించిన మొట్టమొదటి జూలియెట్ గులాజీని 90 కోట్లకు అమ్మారు. ఈ రోజ్ సువాసన చాలా తేలికగా ఉండి, పెర్ఫ్యూమ్ ఫీలింగ్ ని ఇస్తుందని చెబుతున్నారు. ఈ గులాబీ ప్రత్యేకతల్లో సువాసన కూడా ఒకటి అంటున్నారు.చూడటానికి కూడా మిగిలిన గులాబీల కంటే కొంచెం భిన్నంగా ఉండి….లేత పీచ్ కలర్ లో అందంగా ఉంటుంది. ఏది ఏమైనా ఇది మాత్రం సంపన్నుల గులాబీ.