The stray dog ​​died due to medical negligence
mictv telugu

వైద్యుల నిర్లక్ష్యానికి వీధికుక్క మృతి.. అంత్యక్రియలు చేసిన మహిళ

August 9, 2022

విజయవాడలో ఓ మహిళ చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఓ వీధి కుక్క సకాలంలో వైద్యం అందక మరణించగా, మనుషులకు మల్లే అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకుంది. అంతకుముందు రెండు గంటల పాటు వైద్యం అందించక, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. పూర్తి వివరాల్లోకెళితే.. మొగల్ రాజపురానికి చెందిన జంతు ప్రేమికురాలు కీర్తి వీధికుక్కల బాగోగులు చూడడం అలవాటు. వీధిలో కుక్కలు కనపడితే ఇంట్లో అన్నం వండి రోజూ పెడుతుండేది. ఈ క్రమంలో బందరు రోడ్డులోని స్వగృహ ఫుడ్స్ వద్ద వీధికుక్క అపస్మారక స్థితిలో ఉందని కొందరు స్థానికులు ఫోన్ చేయగా, అక్కడకి వెళ్లిన కీర్తి.. ఆస్పత్రిలో చేర్పించడానికి అంబులెన్స్‌కి ఫోన్ చేసింది. ఎంతసేపటికీ రాకపోవడంతో కష్టపడి ఆటోలో ప్రభుత్వ వెటర్నటీ హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. అక్కడికెళ్లాక వైద్యులు రెండు గంటలపాటు కీర్తని ఇబ్బంది పెట్టారు. గర్భంతో ఉన్న కుక్కకు వైద్యం చేయాలని ఎంత బతిమిలాడినా తమ బాధ్యత కాదన్నట్టు వ్యవహరించారు. ఇదంతా ఫోన్‌లో వీడియో తీసిన కీర్తి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసోకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అటు వైద్యం అందక కుక్క మరణించడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించి తన జంతు ప్రేమను చాటుకుంది.