నిజామాబాద్‌లో దారుణం.. పబ్జీ ఆడొదంటే ఉరేసుకున్న విద్యార్థి - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్‌లో దారుణం.. పబ్జీ ఆడొదంటే ఉరేసుకున్న విద్యార్థి

April 17, 2019

పబ్జీ మొబైల్ గేమ్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కొందరు పిచ్చివాళ్లై ఆస్పత్రుల పాలవుతుంటే.. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జగిత్యాల, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇద్దరు యువకులు పబ్జీ ఆడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాలో ఆ గేమ్ నిషేదించాలని డిమాండ్లు సైతం వెలువడుతున్నాయి. అయినా పబ్జీని చాలా మంది ఇంకా బానిసలైపోతున్నారు. తాజాగా నిజామాబాద్‌లో మరో విద్యార్థి పబ్జీ ఆడొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

9వ తరగతి చదువుతున్న శ్రేయస్ అనే విద్యార్థి తరచూ పబ్జీ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని తల్లి ఆట ఆడొద్దని మందలించింది. దీంతో కోపం తెచ్చుకున్న శ్రేయస్ గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరు అవుతున్నారు. యవత పబ్జీ గేమ్‌కు బానిసలు కావొద్దని, ఉన్నతమైన భవిష్యత్తు గాలిలో కలిపేసుకోవద్దని సూచిస్తున్నారు.