రేషన్ కార్డులను భారీ సంఖ్యలో తొలగించిన తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా 19 లక్షలకు పైగా రేషన్ కార్డులను ఏకపక్షంగా ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. ఈ విషయంపై మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బుధవారం ఆదేశించింది. ఆధార్ కార్డు సమర్పించని కారణంగా తొలగించామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలుపగా, ఆధార్ కార్డు ప్రామాణికం కాదని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని కోర్టు గుర్తు చేసింది.
అయినా రేషన్ కార్డులకు ఆధార్ కార్డును తప్పనిసరి ఎలా చేస్తారంటూ మండిపడింది. అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.