The Supreme Court has extended the protection given to Shivalinga in jnanavapi
mictv telugu

మసీదులో శివలింగంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

November 11, 2022

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో కనుగొన్న శివలింగానికి ప్రస్తుతం ఇస్తున్న రక్షణను పొడగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాక, జ్ఞానవాపి – కాశీ విశ్వనాథ్ కేసు వినేదుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించింది. హిందూ వర్గాలు చెప్తున్న శివలింగానికి రక్షణ కల్పించాలని కోరుతూ హిందూ సంఘాలు పిటిషన్ వేశాయి. దీంతో మే 17న సుప్రీం ఆ మేరకు ఆదేశాలిచ్చింది. ఆ గడువు నవంబర్ 12తో ముగుస్తుండడంతో మళ్లీ పిటిషన్ దాఖలు చేయగా, ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ విచారించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ముస్లింలు నమాజు చేసుకునేందుకు కూడా అనుమతినిచ్చింది. కాగా, వీడియో సర్వేలో వెలుగు చూసిన ఆకృతి శివలింగమని హిందూ సంఘాలు వాదిస్తుండగా, ముస్లిం వర్గాలు మాత్రం అదొక ఫౌంటేన్ అని వాదిస్తున్నాయి.