The Supreme Court has issued notices to Ramoji Rao in the Margadarshi case
mictv telugu

రామోజీ రావుకి సుప్రీం నోటీసులు.. తగ్గేదే లే అంటున్న ఉండవల్లి

September 19, 2022

ప్రముఖ వ్యాపార వేత్త రామోజీరావుకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి డిపాజిట్ల సేకరణలో ఉండవల్లి వేసిన పిటిషన్ విచారించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘మార్గదర్శి చేసింది నేరమా కాదా అనే విషయంపై వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించబోతోంది. తెలంగాణను కూడా కేసులో పిటిషన్ దాఖలు చేయాలని కోరడం జరిగింది. కేసీఆర్ చెప్పిన రెండు నెలల తర్వాత కూడా ఎందుకు ఆలస్యం అవుతుందో అర్ధం కావడం లేదు. ఈ కేసులో రామోజీరావు కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాదారుల నుంచి ఎంతో మంది డిపాజిట్లు తీసుకుంటున్నారు. వారిని, రామోజీ రావుని కలిపి చూడవద్దని కోర్టును కోరడం జరిగింది. డిపాజిట్లు తీసుకోవడం నేరమా కాదా? అని కోర్టును అడుగుతున్నాం. మార్గదర్శిలో ఎవరెవరు డిపాజిట్లు చేశారో వారందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి’ అని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున వికాస్ సింగ్ వాదనలు వినిపించారు.