the supreme court has shown reluctance to intervene in mlas poaching case
mictv telugu

TRS ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

November 21, 2022

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి పర్యవేక్షణ, సిట్‌ విచారణ నిలిపేయాలంటూ ఈ కేసు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి వేసిన పిటీషన్ ను కొట్టేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ దశలో ఉన్న ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీం అభిప్రాయపడింది. సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది.

సిట్‌ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. సిట్‌ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్‌పై ఉన్న ఆంక్షలు, నియమ నిబంధనలను న్యాయస్థానం ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను 4 వారాల్లో పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఆదేశించింది. అయితే పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.