ఇప్పుడన్నింటికి మూలం ఆధారే అంటున్నారు. ప్రతీ దానికి ఆధార్‌ను లింక్ చేస్తున్నారు.ప్రైవసీ అనేది భారత ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని ఇటీవలే తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ప్రైవసీకి ఆధార్‌తో భంగం కలుగుతుందని కొంతమంది, వివిధ ప్రభుత్వ పథకాలను ఆధార్‌తో లింక్ చేయడాన్ని ప్రశ్నిస్తూ, మరికొంతమంది సుప్రీంకోర్టులో పిటీషన్లు ధాఖలు చేశారు. మొబైల్‌కు ఆధార్‌ను లింక్ చేయడంపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో భాజపా ఫైర్‌బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆధార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆధార్‌ను జాతి భద్రతకు ముప్పుగా వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్టు తెలిపారు. ఆధార్‌పై సుప్రీంకోర్టులో చర్చ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఖచ్చితంగా నిలిపివేస్తుందని ఆయన ట్వీట్ చేసారు.