మోహన్‌బాబు భూముల విషయంలో కీలక విషయాలు వెల్లడించిన తహసీల్దార్ - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్‌బాబు భూముల విషయంలో కీలక విషయాలు వెల్లడించిన తహసీల్దార్

March 3, 2022

15

చంద్రగిరి సమీపంలోని రామిరెడ్డిపల్లిలో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు పేరిట ఉన్న 5.29 ఎకరాలు పట్టా భూమేనని తహసీల్దార్ శిరీశ ధ్రువీకరించారు. నిషేధ జాబితాలో ఉన్న భూములను కొనుగోలు చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి రికార్డులను పరిశీలించిన అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ… ‘2016లో ప్రభుత్వం ఇచ్చిన జీవోతో మోహన్ బాబు, విష్ణు పేరున ఉన్న భూమి డీకేటీ నుంచి పట్టా భూమిగా మారింది. కానీ, ఆన్ లైన్ లో మాత్రం ఇంకా డీకేటీగా కొనసాగుతుండడంతో కొంత గందరగోళం నెలకొంద’ని వివరించారు.