అనాథ శవాలపై తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

అనాథ శవాలపై తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

November 17, 2022

రాష్ట్రంలో అనాథ శవాలపై తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదాలు, సహజ మరణాల ద్వారా చనిపోయిన గుర్తింపులేని శవాలను కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీలకు ఇవ్వాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన కారణంతో సహజంగానే రీసెర్చ్, అటానమీ కోసం శవాల అవసరం పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే మరణాల విషయంలో ఎలాంటి సందేహాలు లేని, సహజ మరణమని లీగల్‌గా నిర్ధారించుకున్న తర్వాతే మెడికల్ కాలేజీలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎస్పీలు, కమిషనర్ ఆఫ్ పోలీస్, జోనల్ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వు కాపీని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ సెక్రటరీ, రైల్వే అధికారులకు పంపించారు. తాజా నిర్ణయం వల్ల మెడికల్ విద్యార్ధులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు.