The Telangana forest personnel have issued an ultimatum to the government demanding arms
mictv telugu

ఆయుధాలిస్తేనే డ్యూటీ చేస్తాం.. ఫారెస్ట్ సిబ్బంది అల్టిమేటం

November 23, 2022

The Telangana forest personnel have issued an ultimatum to the government demanding arms

పోడు భూముల విషయంలో గుత్తికోయలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావుపై దాడి చేసి ప్రాణాలు తీయడంతో ఫారెస్ట్ సిబ్బంది సీరియస్ అయ్యారు. పోలీసుల వలె తమకు కూడా ఆయుధాలు ఇస్తేనే విధుల నిర్వర్తిస్తామని స్పష్టం చేస్తున్నారు. అలాగే గురువారం నుంచి విధులను బహిష్కరిస్తున్నామని పిలుపునిచ్చారు.

కచ్చితమైన హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అటు శ్రీనివాస రావు అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రులు ఈ కార్యక్రమానికి రాగా, అప్పటికే వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది తమ నిరసన తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస రావు పలుమార్లు తమతో చెప్పారని, ఆరు నెలల క్రితమే ఆయన హత్యకు గుత్తికోయలు ప్లాన్ వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడులపై చాలా కాలంగా ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నామని, శ్రీనివాస రావుపై చేసిన దాడే ఆఖరుది కావాలని నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళనకు పూనుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.