విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి అనుమతిచ్చిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి అనుమతిచ్చిన ప్రభుత్వం

November 12, 2022

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఇప్పుడు ఆ ఎన్నిక అయిపోవడంతో మళ్లీ నోటిఫికేషన్ల జాతర షురూ అయింది. మధ్యల ఎస్టీల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ వల్ల కొంత ఆలస్యమయినా మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా పాఠశాల విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిని టీఎస్పీఎస్సీతో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది.

ఇందులో గెజిటెడ్ ప్రిన్సిపల్ గ్రేడ్ 1 ఉద్యోగాలు 24, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్లు, 22 లెక్చరర్లు, 65 మిగతా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ మేరకు అనుమతి పత్రాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు.