The Telangana government has approved the replacement of another 10,105 jobs
mictv telugu

మరో 10,105 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి

June 17, 2022

The Telangana government has approved the replacement of another 10,105 jobs

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 , బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులకు, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థలో 2,267 పోస్టుల భర్తీకి అనుమతికి ప్రభుత్వం అనుమతిచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 995 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.