తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించింది. ఇందుకోసం మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జీవో జారీ చేసింది. విధులకు ఆలస్యంగా రావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లాంగ్ లీవ్స్ పెట్టడం వంటి కారణాలు తాజా చర్యకు కారణాలని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ విధుల్లో ఉండి ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వైద్యులకు ప్రస్తుతం ఈ నిబంధన వర్తించదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.