26 వేల కార్లను కొన్న తెలంగాణ ప్రభుత్వం.. వ్యయమెంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

26 వేల కార్లను కొన్న తెలంగాణ ప్రభుత్వం.. వ్యయమెంతో తెలుసా?

April 11, 2022

car

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 2014 నుంచి ఈ ఏడేళ్లలో ప్రభుత్వం వివిధ అవసరాల కోసం 26 వేల కార్లను కొనుగోలు చేసింది. ఇందులో 7 వేల మోడల్స్ వరకు ఉన్నాయి. ఇందుకు గాను రూ. 3200 కోట్లను వెచ్చించింది. ఇందులో రూ. 500 కోట్లు రుణంగా తీసుకోవడం గమనార్హం. కేవలం పోలీస్ శాఖ కోసమే స్కార్పియో, ఇన్నోవాల కోసం రూ. 750 కోట్ల విలువైన కొనుగోళ్లను చేసింది. ఈ కార్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఇచ్చింది. వీటిలో ఇన్నోవా, ఫార్చునర్, టాటా, బొలెరో, కియా వంటి ఖరీదైన కార్లున్నాయి. ఇదికాక, 2018లో జిల్లా ఛైర్మన్లకు, సెక్రటేరియట్లోని అడిషనల్, జాయింట్ సెక్రటరీల కోసం హోండా సిటీ, టొయోటా, కొరొల్లా వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఈ కార్ల కోసం జనరల్ ఫండ్ డబ్బులను వాడినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు.