‘రాధేశ్యామ్’కి ప్రభుత్వాల బహుమతులు - MicTv.in - Telugu News
mictv telugu

‘రాధేశ్యామ్’కి ప్రభుత్వాల బహుమతులు

March 10, 2022

11

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు ఐదవ ఆట వేసుకోవడానికి అనుమతినిచ్చింది. మార్చి 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల ప్రభాస్ అభిమానులు ప్రభుత్వానికి
ధన్యవాదాలు తెలుపుతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ జీవో జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ సినిమా తొలి రెండు వారాల కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉంటాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో విడుదలయ్యే ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.