'ఆర్ఆర్ఆర్'కు తీపికబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’కు తీపికబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

March 19, 2022

cvb

తెలంగాణ ప్రభుత్వం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందానికి తీపికబురు చెప్పింది. కథనాయకులుగా జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సాధారణ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ. 50, ఆ తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా ఐమ్యాక్స్ థియేటర్లు, స్పెషల్ కేటగిరీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ. 100, ఆ తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.

మరోపక్క ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రూ. 450 కోట్లతో తెరకెక్కినట్టు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చిత్రబృందానికి టికెట్ల విషయంలో తీపికబురు చెప్పడం సంచనలంగా మారింది.