The thief robbed the gold in the union bank prakasham district
mictv telugu

ఏపీ : బ్యాంకులో పట్టపగలు దోపిడీ.. సీసీ కెమెరాల్లో రికార్డు

June 9, 2022

The thief robbed the gold in the union bank prakasham district

ప్రకాశం జిల్లాలో ఓ దొంగ పట్టపగలే రెచ్చిపోయాడు. దర్జాగా బ్యాంకులోకి దూరి అందరి కళ్ల ముందే బంగారం దోచుకొని పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కొమరోలులో ఉన్న యూనియన్ బ్యాంకులో గుర్తు తెలియని ఓ వ్యక్తి ప్రవేశించాడు. గుట్టు చప్పుడు కాకుండా ఐదు తులాల రెండు గ్రాముల బంగారం దోచుకొని పారిపోయాడు.

ఈ ఘటన అంతా బ్యాంకు బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డవగా, బ్యాంకు లోపలి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చోరీ విషయాన్ని గ్రహించిన బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి బ్యాంకును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, దొంగ బంగారం ఎత్తుకెళ్తుంటే బ్యాంకు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. అలాగే బ్యాంకు లోపలి కెమెరాలు ఎందుకు పనిచేయడం లేదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని పోలీసులను కోరుతున్నారు. కాగా, చోరీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.