‘దమ్ముంటే పట్టుకోండి’ దొంగ సవాల్.. పోలీసులు ఏం చేశారంటే - MicTv.in - Telugu News
mictv telugu

‘దమ్ముంటే పట్టుకోండి’ దొంగ సవాల్.. పోలీసులు ఏం చేశారంటే

March 17, 2022

llll

దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ ఓ దొంగ నేరుగా పోలీసులకు ఫోన్ చేసి సవాల్ విసిరాడు. వాళ్లు పట్టుకోలేరన్న నమ్మకంతో ఎక్కడున్నానో కూడా చెప్పేశాడు. దాంతో పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఆ దొంగను పట్టుకొని అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసులకు ఎదురైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన సత్యేంద్ర షెకావత్ అనే వ్యక్తి ఎంబీఏ చదివాడు. కానీ, ఎలాంటి ఉద్యోగం, వ్యాపారం చేయకుండా దొంగతనాలను తన వ‌ృత్తిగా ఎంచుకున్నాడు. చిన్నా చితకా దొంగతనాలు కాకుండా తన టెక్నాలజీ మైండ్‌తో ఖరీదైన కార్లను చోరీ చేయడం మొదలుపెట్టాడు. చిన్న పరికరం సహాయంతో డోర్‌లాక్‌ను ఛేదించి కారును చోరీ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు వందకు పైగా కార్లను దొంగతనం చేసి వాటిని రాజస్థాన్‌లో అమ్మేవాడు. పదమూడేళ్లుగా రూ. 22 కోట్లకు పైగా కూడబెట్టాడు. తాజాగా ఓ కన్నడ సినీ నిర్మాత కారును దొంగిలించి పోలీసులకు ఫోన్ చేసి సవాల్ విసిరాడు. దీంతో సత్యేంద్రను రాజస్థాన్‌లో పట్టుకున్న పోలీసులు బెంగళూరుకు తీసుకొచ్చి తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆధారాలు సేకరించి దొంగకు కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్నారు పోలీసులు.