దేవాలయంలో చోరీకి వెళ్లి ఇరుక్కుపోయిన దొంగ.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

దేవాలయంలో చోరీకి వెళ్లి ఇరుక్కుపోయిన దొంగ.. వీడియో వైరల్

April 5, 2022

ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి వెళ్లిన ఓ యువవకుడు కన్నంలో ఇరుక్కుని బయటకు రాలేక దొరికిపోయిన సంఘటన ఇది. వివరాల్లోకెళితే.. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని జాడుపూడి గ్రామంలో ఉన్న దేవాలయంలో చోరీకి కంచిలి మండలానికి చెందిన పాపారావు ప్రయత్నించాడు. మంగళవారం తెల్లవారుజామున కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అమ్మవారికి ఉన్న ఆభరణాలు, వస్తువులు చోరీ చేసి అదే కన్నం గుండా బయటపడాలని చూశాడు. ఈ క్రమంలో కన్నం గుండా నడుము వరకు బయటకు వచ్చి మధ్యలో ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు. కొద్దిసేపట్లో తెల్లారాక, గ్రామస్థులు అటుగా రావడంతో దొంగ వారి కంటబడ్డాడు. విషయం గ్రహించిన గ్రామస్థులు దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. ఈ తతంగాన్ని స్థానిక యువకులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది.