ఉత్తర కొరియా ఉల్కి పాటు చర్యలు దాన్ని ఏకాకిని చేస్తున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది నిజమనిపిస్తున్నది. ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగం చేసిన తర్వాత దానికి మద్దతు నివ్వాలనుకున్న దేశాలు కూడా వెనకగడుగువేస్తున్నట్లే కన్పిస్తున్నది. ఉత్తర కొరియాపై అమెరికా పలు రకాల ఆంక్షలు విధించింది. అన్ని రకాల ఎగుమతులపై నిషేధం విధించింది. పైగా తమ చర్యను సమర్థించుకుంటున్నామని యూఎన్ లో అమెరికా రాయబారిగా కొనసాగుతున్న నిక్కి హేళీ చెప్పారు.
తాము పెట్టిన ఆంక్షలపై రష్యా, చైనాలు అభ్యంతరం చెప్తాయని అనుకున్నామని… అయితే అవి కూడా కామ్ గా ఉన్నాయని ఆమె చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కిమ్ జోంగ్ దుందుడుకు చర్యలే కారణమా అనే ప్రచారమూ జరుగుతున్నది. కొత్తరకొరియా ఆంక్షలపై యూఎన్ లో వీటో ఉపయోగిస్తామని రెండు లెఫ్ట్ దేశాల గురించి తాము అనుకున్నామని అయితే అవి కామ్ గా ఉండటం శుభపరిణామం అని అంటున్నారు నిక్కి హేళీ .
కొన్నేళ్ల నుండి చైనాకు, ఉత్తర కొరియాకు మంచి వ్యాపార సంబంధాలున్నాయి. అయినా కూడా చైనా ఏమీ అనలేదు. పైగా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని… అదీ ఓ దేశ ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని చైనా తప్పు పట్ట తీరుతుందని ప్రపంచం భావిస్తుంది. కానీ దానికి భిన్నంగా చైనా వైఖరి తీసుకున్నది. ముందు ముందు జరగబోయే ఏ పరిణామాలకు ఇదే సంకేతమో అర్థం అవుతున్నది.
ఇటు భారత్ తో ఇబ్బందులు పడుతున్న చైనా.. ఇంకో వైపు నేరుగా అమెరికాతో ఎందుకు కయ్యం అనుకుంటున్నదేమో మరి. కనీసం రష్యా అయిన ఉత్తరకొరియాకు సపోర్టు చేయాలి కదా అంటే అదీ లేదు. ఇదంతా కూడా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అత్యుత్సాహామేనని కొందరు అంటున్నారు. ఈ నియంత ఎవ్వరి మాట వినకుండ మూడో ప్రపంచ యుద్దం తెస్తాడా ఏమిరా బాబు అని ప్రపంచం అనుకునేలా సిగ్నల్ పంపిస్తున్నాడు.
ఉత్తర కొరియాను ఏకాకిని చేసిన తర్వాత దానిపై సైనిక చర్య తీసుకోవడానికి కూడా అమెరికా వెనుకాదు. ఇది గత చరిత్ర చూపిస్తున్న సత్యం. అయితే సైనిక చర్య తీసుకునే సూచనలూ ఉన్నట్లు నిక్కి హేళీ అంటున్నారు. ఈ యంగ్ లీడర్ ప్రపంచాన్ని ఎటు వైపు తీసుకెళ్తాడో. కిమ్ జోంగ్ తమ సహనాన్ని పరీక్షిస్తున్నాడని అమెరికా అధ్యక్షులు ట్రంప్ కూడా అనడం గుర్తించాల్సిన విషయం.