The thug attacked Salman Rushdie with a knife
mictv telugu

అమెరికా : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి చేసిన దుండగుడు

August 13, 2022

భారత్‌లో జన్మించి అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. న్యూయార్క్‌లోని ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు సమయాత్తమవుతుండగా వేగంగా వేదికపైకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి రష్దీ మెడపై కత్తితో పొడిచాడు. అంతటితో ఆగక పలుమార్లు అదేపనిగా పొడవడంతో రష్దీ వేదికపైనే కుప్పకూలిపోయారు. అక్కడున్న సిబ్బంది వెంటనే సపర్యలు చేసి అనంతరం హెలికాప్టర్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ వెల్లడించారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బుకర్ ప్రైజ్ విన్నర్ అయిన రష్దీ 1988లో తాను రచించిన నాలుగో నవల ‘ద సెటానిక్ వెర్సెస్’ కారణంగా వివాదాస్పదమయ్యారు.

ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధంగా రచించాడని ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. రష్దీని చంపితే ఇరాన్ అప్పటి అధ్యక్షుడు 3 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తానని ప్రకటించాడు. దాంతో అప్పటినుంచి రహస్య జీవితాన్ని గడుపుతున్న రష్దీ.. పుట్టిన దేశమైన భారత్‌కు రావడానికి ప్రయత్నిస్తే కేంద్రం అతనికి వీసా నిరాకరించింది. రష్దీకి రెండు పెళ్లిళ్లు చేసుకోగా, నలుగురు పిల్లలు ఉన్నారు. అటు వివాదాస్పదమైన సెటానిక్ వెర్సెస్ నవలను వివిధ భాషల్లో అనువాదం చేసిన ఇతర రచయితలు అందరూ హత్యలకు గురయ్యారు లేదా అనుమానాస్పదంగా చనిపోయారు. కాగా, రష్దీపై జరిగిన దాడిపై రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత పటిష్ట భద్రత ఉండే ప్రాంతంలో కూడా దాడి జరిగిందంటే అక్కడి భద్రతలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు.