టూరిస్టులపైకి దూసుకొచ్చిన పులి.. అంతలోనే ట్విస్ట్.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

టూరిస్టులపైకి దూసుకొచ్చిన పులి.. అంతలోనే ట్విస్ట్.. వీడియో

November 28, 2022

అడవుల్లోని వన్యప్రాణులను వాటి మానాన వదిలేస్తేనే మంచిది. కానీ మనం వాటి ఆవాసాల్లోకి వెళ్లి మరీ కెలుక్కుంటాం. ఈ మధ్య మనుషులకు ఇది బాగా అలవాటైపోయింది. మనుషులను చూసి అవి బెదిరిపోవడమో లేక తిరిగి దాడి చేసి ప్రాణాలు తీయడమో చేస్తుంటాయి. వాటితో ఎలా వ్యవహరించాలో కనీసం తెలియకపోవడమే అసలు సమస్య. ఇలాంటి అంశాలను గుర్తుకు తెచ్చే ఓ వీడియోను తాజాగా ఫారెస్ట్ అధికారి సురేందర్ మెహ్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

వీడియో ప్రకారం.. కొంతమంది టూరిస్టులు ఓ ఓపెన్ జీపులో ఉండగా, పొదల మాటున పులి ఉండడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అది ఎప్పుడు బయటకు వస్తుందా.. ఎప్పుడు ఫోటో తీసుకుందామా అనే ఆలోచనలో టూరిస్టులు కెమెరాలను రెడీగా పట్టుకొని వేచిచూస్తున్నారు. అయితే మనుషుల మీద కోపమో ఏమో ఆ పులి గాండ్రిస్తూ ఉగ్రంగా బయటకు వచ్చింది. ఒక్కసారిగా టూరిస్టులపైకి దూసుకొచ్చింది. ఆ దెబ్బకు డ్రైవర్ భయంతో జీపును కాస్త ముందుకు తీసుకెళ్లాడు. అంతలో అందరూ కలిసి గట్టిగా అరవడంతో పులికాస్త వెనక్కి తగ్గి వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కానీ, కొన్ని సార్లు పులిని చూడాలనే మన ఆరాటం వాటి జీవితంలోకి చొరబడడం తప్ప మరొకటి కాదని సురేందర్ ట్వీట్ చేశారు.