The traffic police fined the police in bangalore
mictv telugu

ఎవరైనా సరే.. రూల్స్ పాటించాల్సిందే.. వైరల్ అవుతున్న పిక్

October 21, 2022

ప్రభుత్వం నిబంధనలు అమలు చేసేది సామాన్య ప్రజలకు మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, చివరికి నిబంధనలు అమలు చేసేవారు కూడా పాటించాల్సిందేనంటున్నారు బెంగళూరు పోలీసులు. హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చే సాధారణ పౌరులకు విధించినట్టే పోలీసులకు కూడా జరిమానా విధించి శభాష్ అనిపించుకున్నారు. బెంగళూరులోని ఆర్టీ నగర్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగర పాలక సంస్థ బీటీపీ ట్విట్టర్‌లో ఆ వివరాలను పోస్ట్ చేసింది. అందులో స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న పోలీసును ట్రాఫిక్ పోలీస్ ఆపి జరిమానా విధిస్తున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫోటోలో నవ్వుతున్న పోలసును చూస్తే స్టంట్‌లాగా అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. కొందరు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు.