27వ అంతస్తు బాల్కనీలో చావు సెల్ఫీ.. - MicTv.in - Telugu News
mictv telugu

27వ అంతస్తు బాల్కనీలో చావు సెల్ఫీ..

October 13, 2018

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. చచ్చిపోయినోళ్లకు అదే చివరిబాధ. అయితే వారి కుటుంబాలకు మాత్రం అది తీరని వేదన. ఒక ఉపాధ్యాయురాలు సెల్ఫీ మోజుతో ప్రాణాలు తీసుకుంది. 27వ అంతస్తు బాల్కనీలో నుంచుని స్వీయచిత్రం తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జారిపడిపోయింది.

https://www.youtube.com/watch?v=3BPr-lm7awM

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీలో శుక్రవారం ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిందీ విషాదం. పోర్చుగల్ నుంచి వలస వచ్చిన సాండ్రా మాన్యులా డా కోస్టా అనే 27 ఏళ్ల టీచర్ బాల్కనీ రెయిలింగ్‌పై కూర్చుని సెల్ఫీ స్టిక్ పట్టుకుని పోజివ్వడానికి యత్నించింది. పట్టుతప్పి అమాంతంగా పడిపోయింది. పక్క భవనంలోని ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. పడిపోతున్నప్పుడు సాండ్రా.. గట్టిగా కేకలు వేసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.