కుర్చీలతో కొట్టుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు.. - MicTv.in - Telugu News
mictv telugu

కుర్చీలతో కొట్టుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు..

May 10, 2019

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం రసాభాసగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్ఫరం కుర్చీలతో కొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మూడో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించేందుకు పీక్లా నాయక్‌ తండాకు వెళ్లారు. అక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఇంతలో నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారంటూ ఓ టీఆర్ఎస్ కార్యకర్త అడిగారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ వర్గీయులు అతడిపై దాడికి యత్నించారు.

The two parties were beaten with chairs….

క్షణాల్లోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. గో బ్యాక్ ఉత్తమ్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను వారించడంతో అందరూ చల్లబడ్డారు. అనంతరం ఉత్తమ్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయినప్పటికీ గ్రామంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  కాంగ్రెస్‌ ఎంపీటీసీ లకావత్‌ రామారావు ఇంటిపై టీఆర్ఎస్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాలు మాటామాటా అనుకున్నాయి. ప్రస్తుతం ఆ తండాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.