మాకు ఏ శిక్ష వేస్తారో ప్లీజ్ చెప్పండి సార్.. ఉదయ్‌పూర్ హంతకుల ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

మాకు ఏ శిక్ష వేస్తారో ప్లీజ్ చెప్పండి సార్.. ఉదయ్‌పూర్ హంతకుల ప్రశ్న

July 6, 2022

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్య కేసులో ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తమ కస్టడీలో తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణ జరుపుతున్నప్పుడు నిందితులు అధికారులను ఆసక్తికర ప్రశ్న అడిగినట్టు తెలుస్తోంది. ‘కన్హయ్యను నరికి చంపినందుకు మాకు ఉరి శిక్ష వేస్తారా? లేక జీవిత ఖైదు వేస్తారా? ప్లీజ్ చెప్పండి సార్’ అని అడిగారు. నేరం చేసిన తమకు ఏ శిక్ష పడుతుందో తెలుసుకోవాలనే కుతూహలం వారిలో ఉన్నట్టు దర్యాప్తు అధికారి ఒకరు ఆఫ్ ద రికార్డ్ తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో నిందితుడు బీహార్‌కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఆచూకీ గురించి పక్కా సమాచారం అందుకున్న అధికారులు, మంగళవారం పాతబస్తీలోనే అతడిని అరెస్ట్ చేసి రాజస్థాన్‌కు తరలించారు.