ఇదేం చైనారా బాబు.. ఈత పరీక్ష ఆన్‌లైన్లో నిర్వహిస్తారంట - MicTv.in - Telugu News
mictv telugu

ఇదేం చైనారా బాబు.. ఈత పరీక్ష ఆన్‌లైన్లో నిర్వహిస్తారంట

May 28, 2022

చైనాలోని ప్రఖ్యాత షాంఘై యూనివర్సిటీ చేసిన ప్రకటన వింత గొలిపేలా ఉంది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని పరీక్షలు ఆన్‌లైన్లో నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అందులో ఈత పరీక్ష కూడా ఉండడం గమనార్హం. చైనాలో గ్రాడ్యుయేషన్ చేసే వాళ్లందరూ 50 మీటర్ల ఈత పరీక్షలో పాల్గొనాలి. ఇలాగయితేనే డిగ్రీ పూర్తయినట్టు. సీనియర్ విద్యార్ధులకు స్విమ్మింగ్ ఫైనల్ టెస్టు ఉంటుంది. కానీ, ఆన్‌లైన్లో ఈత పరీక్ష ఎలా పెడతారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీనిపై రకరకాల జోకులతో మీమ్స్ వచ్చేశాయి. ఇదే దారుణం అనుకుంటే ఆ యూనివర్సిటీ ఉద్యోగి ఇచ్చిన సమాధానం మరీ విచిత్రంగా ఉంది. ‘లాక్ డౌన్ ఉండడంతో అన్ని టెస్టులతో పాటు స్విమ్మింగ్ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. విద్యార్ధులు తప్పనిసరిగా పాల్గొనాలి’ అని చెప్పాడు. కాగా, వెబ్ ప్రపంచంలో ఈదడానికి ఇదేమైనా కొత్త వెర్షనా, మా ఇంట్లో బాత్ టబ్ ఉంది అందులో ఈత కొడితే ఓకేనా అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.