వీడియో : రేపిస్టు మర్మాంగంపై మహిళ దాడి - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : రేపిస్టు మర్మాంగంపై మహిళ దాడి

June 8, 2022

సమాజంలో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. యుక్త వయసు మహిళలపైనే కాకుండా చిన్న పిల్లల మీద కూడా కొందరు దుర్మార్గులు అఘాయిత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల దొరికిన రేపిస్టులను గ్రామస్థులు దేహ శుద్ధి చేస్తున్నారు. పోలీసులు రాక ముందే వారికి తగిన శాస్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై 45 ఏళ్ళ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఇది గమనించిన గ్రామస్థులు కామాంధుడిని పట్టుకొని చితకబాదారు. కర్రలతో కొడుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఆవేశం పట్టలేని ఓ మహిళ అయితే కామాంధుడి మర్మాంగంపై కాలితో తన్నింది. అనంతరం స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టేసి నిందితుడి రక్తం కళ్ల జూశారు. కాసేపటికి పోలీసులు వచ్చి నిందితుడుని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా, అత్యాచారానికి గురైన పసిపాప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.