TS BJP : తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..12న సంగారెడ్డికి అమిత్ షా..!! - Telugu News - Mic tv
mictv telugu

TS BJP : తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..12న సంగారెడ్డికి అమిత్ షా..!!

March 3, 2023

తెలంగాణపై బీజేపీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు బీజేపీ హైకమాండ్. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే నిత్యం ప్రజల్లోకి వెళ్లేట్లుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 12వ తేదీన ఆయన తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. సంగారెడ్డిలో జరిగే బీజేపీ మేధావుల సదస్సుల్లో అమిత్ షా పాల్గొనున్నారు.

కాగా బీజేపీ రాష్ట్ర నేతలు మంగళవారం నాడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాల గురించి జాతీయ నాయకత్వం సంతృప్తిగా ఉందని చెప్పారు. ఎన్నికలు ఎఫ్పుడు వచ్చినా తాము కూడా రెడీగా ఉన్నామని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ప్రజాగోస కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా చెప్పారు. త్వరలోనే 10 జిల్లాలో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామన్నారు. ఈ సభలకు మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా తీసుకోవల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు.