టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వారియర్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు ఇదివరకే సోషల్ మీడియాలో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన తెలుగుతోపాటు, తమిళ భాషలో విడుదల చేయనున్నారు.
అయితే, ‘ది వారియర్’ చిత్రానికి సంబంధించి శనివారం చిత్రబృందం మరో విషయాన్ని తెలియజేసింది. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి డేట్‌ను ఫిక్స్ చేశామని, ఈ నెల 10న (ఆదివారం) హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్స్‌లో ఈ వేడుకను జరపనున్నట్లు అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ వేడుక రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారనే విషయంపై మాత్రం చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘ది వారియర్’ ప్రీరిలీజ్‌కు ముఖ్యఅథితి వస్తారా? రారా? అనే దానిపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. మరి రేపు సాయంత్రం వరకు ఏం జరుగుతుందోనని, చిత్రబృందం సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.