The way girls change boyfriends: BJP leader’s ‘sexist’ jibe at Nitish Kumar earns Congress fire
mictv telugu

అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్‌లను మార్చినట్లు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

August 19, 2022

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కైలాష్ విజ‌య వ‌ర్గియా. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్‌ల‌ను త్వ‌ర‌గా మార్చేస్తారని, అదే విధంగా.. నితీశ్ కుమార్ ఎప్పుడు ఎవ‌రి చేయి పట్టుకుంటారో ఎవ‌రిని ఎప్పుడు వ‌దిలేస్తాడో చెప్ప‌లేమ‌న్నారు. తాను కొన్ని రోజుల క్రితం విదేశాలకు వెళ్లానని, అక్కడ అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ ను ఎప్పుడు ఏ క్షణంలో మారుస్తారో తెలియదని తనకు ఓ మిత్రుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు బీహార్ సీఎం కూడా అలాగే వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇక వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. బీజేపీకి మహిళలంటే గౌరవం లేదని మండిపడుతున్నాయి. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్, ఉపముఖ్యమంత్రిగా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆగస్టు 10న ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ మహాకూటమి మొత్తం బలం 163. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ నితీష్ కుమార్‌కు మద్దతు ఇవ్వడంతో దాని బలం 164కి చేరుకుంది. ఆగస్టు 24న బిహార్ అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉంది.