బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) బిగ్‌షాక్ ఇచ్చింది. జాక్వెలిన్‌కు చెందిన రూ. 7.27కోట్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేసుకున్నారు. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ అనే నేరగాడితో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నాయని, సురేశ్ నుంచి ఆమె ఖరీదైన వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్లు, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్లు తదితర కానుకలు అందుకున్నట్లు జాక్వెలిన్‌పై ఆరోపణలు రావడంతో అధికారులు ఆమె ఆస్తులను అటాచ్ చేసుకున్నారు.
ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..’ మేము చేపట్టిన దర్యాప్తులో చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. సురేష్ జాక్వెలిన్‌కు గతంలో ఖరీదైన అభరణాలు, కానుకలను ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులకు ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి. అందుకే ఆమెకు సంబంధించిన రూ. 7.27కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకున్నాం” అని అన్నారు.
మరోపక్కజాక్వెలిన్ ఫెర్నాండేజ్ 2011లో మర్డర్ 2 అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఏంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో వరుస సినిమాలు చేస్తూ, బీజీ బీజీగా ఉంది. ఆ తరువాత ఆమె హౌస్‌ఫుల్ 2, రేస్ 2 సినిమాల్లో నటించి మంచి పేరును సొంతం చేసుకున్నారు.