The wife made videos supporting her husband
mictv telugu

మైనర్‌పై భర్త అత్యాచారం.. ఎంకరేజ్ చేస్తూ వీడియో తీసిన భార్య

July 16, 2022

యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. భర్తకు నచ్చిన మైనర్ అమ్మాయిని బలవంతంగా గదిలోకి తోసి ఆపై వీడియో తీసిన భార్య సంఘటన సంచలనం రేపుతోంది. భర్త కోరికను మొదట్లోనే అడ్డుచెప్పి వ్యతిరేకించాల్సిన భార్య అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఈ నెల 12న జరిగిన ఈ దారుణ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బదౌన్ అనే గ్రామంలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. వీరి ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక ఉండేది. పక్కింటి వారు కావడంతో ఆ బాలిక తరచూ వీరి ఇంటికి వస్తూ ఉండేది. ఈ క్రమంలో భర్త కన్ను ఆ బాలికపై పడగా, కోరిక తీర్చుకోవడం కోసం పథకం వేశాడు.

ఈ పనికి తన భార్య సహాయం కోరాడు. ఆమె అడ్డుచెప్పకుండా సరేనని ఒప్పుకొని బాలికను ఇంటికి పిలిచింది. మాట్లాడుతూ బాలికను భర్త ఉన్న గదిలోకి తోసేసింది. అనంతరం భర్త బాలికపై అత్యాచారం చేస్తుండగా, భార్య ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసింది. తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన బాలిక రెండ్రోజులు ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అయితే రెండ్రోజుల తర్వాత భార్యాభర్తలు అకస్మాత్తుగా వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం అందరికీ తెలిసిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు బాలికను నిలదీయగా, అసలు విషయం చెప్పేసింది. ఈ నేపథ్యంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు పోక్సో చట్టం కింద కేసు పెట్టి దంపతులను అరెస్ట్ చేశారు.