The wife tied her husband to an electric pole and beat him
mictv telugu

భర్తను అర్ధ నగ్నంగా స్తంభానికి కట్టేసి చెప్పుల దండ వేసిన భార్య.. వీడియో

September 17, 2022

The wife tied her husband to an electric pole and beat him

రెండో వివాహం చేసుకున్న తన భర్తను కరెంట్ స్తంభానికి కట్టేసి చెప్పుల దండ వేసింది ఓ భార్య. అంతకు ముందు చెప్పులతో దేహ శుద్ది చేసింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగింది ఈ సంఘటన. వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి నాలుగేళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో రూ. 20 లక్షల వరకట్నం ఇవ్వగా, వీరికి ఓ పిల్లాడు సంతానం. అయితే పిల్లాడు పుట్టిన అనంతరం భార్యను వదిలేసిన శ్రీకాంత్ రెడ్డి వరంగల్ వెళ్లి రెండో పెళ్లి చేసుకున్నాడు.

 

 

ఈ విషయం తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సహాయంతో వరంగల్ వెళ్లి శ్రీకాంత్ రెడ్డిని స్వర్ణపల్లికి తీసుకొచ్చింది. అనంతరం గ్రామస్థుల సమక్షంలోనే శ్రీకాంత్‌ను కరెంటు పోల్‌కి కట్టేసి చితకబాదింది. కుమారుడిని చంకలో ఎత్తుకొని పిల్లాడి ముందే చెప్పుల దండను శ్రీకాంత్ మెడలో వేసింది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ ఆగ్రహం, ఆవేదనతో రోదించింది. ఈ తతంగాన్ని చుట్టూ ఉన్నవారు చూస్తూనే ఉన్నారు తప్ప అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ వీడియో దృష్యాలు బయటకి రావడంతో మానవహక్కుల సంఘాల వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా ఓ మహిళకు జరిగితే మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాయని, పురుషుడు కాబట్టి వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. చట్టప్రకారం లింగ భేదం లేకుండా సమాన న్యాయం ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనలో అఖిలకు ఏమైనా సమస్య ఉంటే పోలీసులు లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప ఇలా అనాగరికంగా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.