The wife took a video of the lightning that hit her husband on camera
mictv telugu

వీడియో : భర్తపై పడ్డ పిడుగు.. లైవ్‌లో బంధించిన మహిళ

July 8, 2022

The wife took a video of the lightning that hit her husband on camera

వర్షాకాలం అనగానే చాలా మందికి ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మరికొందరు మాత్రం పచ్చగా మారే ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకుంటారు. వారిలోనే కొంతమందికి వర్షం పడుతున్నప్పుడు రోడ్డు మీద అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లాలనే ఉత్సుకత ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు పిడుగు పడడం లాంటి ప్రమాదం కూడా ఉంటుంది. అలా వెళ్లిన ఓ జంటలోని భర్తపై పడిన పిడుగు గురించి ఈ వార్తా కథనం. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది.

సరదాగా వర్షంలో తడవాలని భార్యభర్తలు చెరో వాహనంలో బయల్దేరారు. భర్త ట్రక్కులాంటి వాహనంలో ముందు వెళ్తుండగా, భార్య మరో కారులో వెనకే వస్తుంది. ఈ హ్యాపీ మూమెంటును చిరకాలం దాచుకోవాలనే ఉద్దేశంతో ఆ భార్య కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తుంటుంది. ఇంతలో ముందు వెళ్తున్న భర్త వాహనంపై హఠాత్తుగా పిడుగు పడుతుంది. క్షణాల్లో మంటలు రేగి ఆ వెంటనే ఆ మంట మాయమైపోతుంది. ఈ ఘటనలో భర్తకు స్వల్ప గాయాలు కాగా అతడిని సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పిడుగు పడడం మాత్రం కెమెరాలో రికార్డయింది. ఈ శుక్రవారం జరిగిన ఈ ఘటన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వర్షాకాలంలో బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.