The wind left by the singer..online sale, price is Rs.8 lakhs
mictv telugu

సింగర్ వదిలిన గాలి..ధర రూ.8లక్షలే

August 29, 2022

అమెరికా దేశానికి చెందిన ప్రముఖ సింగర్ బిల్లీ ఎలిష్‌..వదిలిన గాలిని ఓ అభిమాని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె వదిలిన గాలిన ఎలా బంధించాడు? ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడితే, ఎవరైనా కొన్నారా? అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే…

సింగర్ బిల్లీ ఎలిష్‌..ఆమెరికాలోనే బెస్ట్ సింగర్. ఇప్పటి వరకు ఆమె ఎన్నో పాటలుపాడి, ప్రజల మనసును దోచుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఆమె రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించింది. ఈ క్రమంలో తాజాగా బిల్లీ ఎలిష్ ఓ షోకు హాజరై, బయటికి వస్తుండగా ఓ పిచ్చి అభిమాని ఆమెను కలిసేందుకు ఆసక్తి చూపించాడు. అత్యంత సమీపంగా వెళ్లి, ఆమె శ్వాసిస్తూ వదలిన చుట్టుపక్కల గాలిని ఓ ప్లాస్టిక్ కవర్‌లో బంధించాడు. బంధించిన ఆ గాలి ‘బిల్లీ ఎలిష్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి, గాలి కావాల్సిన వారు 10వేల డాలర్లు (సుమారు రూ.8లక్షలు) వెచ్చించి, కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నాడు.

అంతేకాదు, ”అదృష్టవశాత్తు నాకు సింగర్ బిల్లీ ఎలిష్‌ని కలిసే అవకాశం వచ్చింది. కానీ, ఇంకా ఆమె అభిమానులు ఎవరైనా ఉంటే, ఆమెను కలవలేకపోయామని పదే పదే బాధపడే వాళ్లకోసం..ఆమె వదలిన గాలిని ఆన్‌లైన్‌లో ఉంచాను. ధర 10వేల డాలర్లు (సుమారు రూ.8లక్షలు). కావాల్సిన వాళ్లు ఆర్డర్ చేయండి” అని రాసుకొచ్చాడు. ఆ ప్రకటన కాస్తా వైరల్‌గా మారడంతో అనంతరం కొద్ది సమయానికే ప్రకటన ఆన్‌లైన్‌లో నుంచి మాయమైపోయింది. నెటిజన్లు స్పందిస్తూ..‘ఆ గాలిని అమ్మటం ఇష్టం లేక ప్రకటనను తొలగించి ఉంటాడు. లోకంలో ఇలాంటి పిచ్చి వారికి కొదవేముంది. ఎవరో ఒకరు కొనుగోలు చేసి ఉంటారు. అందుకే ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు’ కామెంట్ చేస్తున్నారు.