అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు సాధించిన విండీస్ ప్లేయర్ - MicTv.in - Telugu News
mictv telugu

అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు సాధించిన విండీస్ ప్లేయర్

March 29, 2022

hmghng

హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోకండి. వార్త పూర్తిగా చదివితే అలా ఎలా అయ్యాడో తెలుస్తుంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసింది శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. ఆ తర్వాత స్థానంలో ఇటీవల చనిపోయిన షేన్ వార్న్ ఉన్నారు. అయితే విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ ఇప్పటివరకు 77 టెస్టులు ఆడి 25 వికెట్లు తీశాడు. ఈ 25 వికెట్లు కూడా 25 మంది బ్యాట్స్‌మెన్‌వి. చాలా మంది బౌలర్లు ఒక బ్యాట్స్‌మెన్‌ వికెట్లను అనేక సార్లు తీస్తుంటారు. అలా బ్రాత్‌వైట్‌ ఒక్క వికెట్ కూడా ఇప్పటి వరకు తీయలేదు. అంటే రిపీట్ వికెట్ ఒక్కటి కూడా లేదన్నమాట. ఈరకంగా చూస్తే ఇదే ఇప్పటివరకు రికార్డు. రెండో స్థానంలో 21 వికెట్లతో బంగ్లాదేశ్ బౌలర్ మహ్మద్ అష్రాఫుల్ ఉన్నారు. మూడో స్థానంలో శ్రీలంక బౌలర్ సజీవ డిసిల్వా 16 వికెట్లతో ఉన్నారు.