The woman I'm dating: A tennis player
mictv telugu

ఆ మహిళతో నేను డేటింగ్‌లో ఉన్నా: టెన్నిస్ క్రీడాకారిణి

July 20, 2022

” ప్రస్తుతం నేను నతాటియా జబియాకో అనే మహిళతో డేటింగ్‌లో ఉన్నాను” అని రష్యా టెన్నిస్ క్రీడాకారిణి దరియా కసట్కినా తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని బయటపెట్టింది. తన గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్తూ, ఆమె.. ఫిగర్ స్కేటర్ నతాటియా జబియాకో అంటూ ఆమెతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోను వీక్షిస్తున్న వారంతా ఏంటీ టెన్నిస్ క్రీడాకారులు కూడా స్వలింగ సంపర్కంలో ఉంటారా? అంటూ ఆశ్చర్యానికి లోనైతున్నారు.

రష్యా దేశంలో స్వలింగ సంబంధాలపై ఇప్పటికే అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధిస్తుంది. అయినా, ఈ స్వలింగ సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో మరోసారి మరింత కఠినతరం చేయడం గురించి రష్యా పార్లమెంట్ చర్చిస్తుంది. ఈ తరుణంలో ఆమె ఈ విషయం చెప్పడం హాట్ టాఫిక్‌గా మారింది. దరియా కసట్కినా ఇన్‌స్టాగ్రామ్‌లో తన గర్లఫ్రెండ్ ఇమెనంటూ, ఇద్దరు కలిసి ఉన్నా ఫోటోను షేరు చేస్తూ, హృదయం ఎమోజీని జోడించింది.

జబియాకో వింటర్ ఒలింపిక్స్ రజత పతక విజేత. 2018లో రజతం నెగ్గిన రష్యా జట్టులో ఆమె సభ్యురాలు. 25 ఏళ్ల కసట్కినా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం స్వలింగ సంబంధానికి దారితీయడం, రష్యా ప్రజలు, నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.