The woman survived the train accident in the blink of an eye
mictv telugu

వీడియో : దూసుకొచ్చిన రైలు.. రెప్పపాటులో బతికిపోయిన మహిళ

July 20, 2022

ఇంటర్నెట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు దిగి పట్టాలు దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన మరో రైలు నుండి ఓ మహిళ తృటిలో తప్పించుకుంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా షేర్ చేయగా, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వీడియో ప్రకారం.. స్టేషను రాక ముందే ఆపేసిన రైలు నుండి ప్రయాణికులు కిందకు దిగారు. సామాన్లు కిందకు దింపిన తర్వాత పక్కనే ఉన్న మరో ట్రాక్‌ను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఆ ట్రాక్‌పై మరో రైలు వస్తుందని హెచ్చరించినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఓ మహిళ తన లగేజీని పట్టాలు దాటి అటువైపు విసిరి మళ్లీ ఇటొచ్చే ప్రయత్నం చేసింది. ఇంతలో రైలు 80 కిలోమీటర్ల వేగంతో రావడంతో రెప్పపాటులో మహిళ తప్పించుకున్నట్టయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న యువకులు వీడియో తీయగా, ఇలాంటి పనులు చేయవద్దని రైల్వే అధికారులు హితవు పలుకుతున్నారు. ఒక్క నిమిషం ఓపిక పడితే పోయేదేమీ లేదని, అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని కోరుతున్నారు.