సాదుకున్న పిల్లులే మహిళను తినేశాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

సాదుకున్న పిల్లులే మహిళను తినేశాయి..

June 22, 2022

 

ఇంట్లో ఎంతో ఇష్టంగా, అల్లారు ముద్దుగా సాదుకున్న 20 పిల్లులు ఓ మహిళను తినేసిన ఘటన రష్యాలోని రోస్టోవ్‌లో జరిగింది. రష్యా మీడియాల కథనం ప్రకారం..’రోస్టోవ్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ 20 పిల్లులను అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ, ఆ మహిళ ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలి చనిపోయింది. దాంతో పిల్లులకు ఆహారం పెట్టేవారు లేక ఒంటరిగా మిగిలిపోయాయి.

ఈ క్రమంలో ఆకలితో అలమటిస్తున్న ఆ 20 పిల్లులు చనిపోయి పడి ఉన్న తమ యాజమాని శవాన్ని ఆహారంగా తిన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి భయంకరమైన వాసన వస్తుండడంతో గమనించిన ఓ వ్యక్తి పిల్లులను రక్షించి, సమాచారాన్ని పోలీసులకు అందించినట్లు ఆ వ్యక్తి మీడియాకు తెలిపినట్లు పేర్కొన్నాయి. అయితే, ఆమె మరణించిన రెండు వారాల తర్వాత పాక్షికంగా పిల్లులు తిన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

ఈ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్స్ పిల్లులు అంత పని చేశాయా? వాటికి ఎంత ధైర్యం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఆశ్చార్యానికి లోనైతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయా అని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.