వీడియో : ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్లో పడ్డ మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్లో పడ్డ మహిళ

April 23, 2022

ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందన్న దానికి ఈ మహిళ సజీవ సాక్ష్యం. చుట్టు పరిసరాలను గమనించకుండా మాటల్లో పడి కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ ఘటన వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ, ఆటో వెనకాల వెళ్తోంది.

ఈ క్రమంలో ముందున్న మ్యాన్‌హోల్‌ను గమనించలేదు. అలా వెళ్తుండగా సడెన్‌గా అందులో పడిపోయింది. సుమారు 7 అడుగుల లోతు ఉన్న ఆ మ్యాన్‌హోల్ నుంచి స్థానికులు ఆమెను బయటికి తీశారు. మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, మనం కూడా ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి.