The woman who filed the case against the boy and harassed him
mictv telugu

బాలుడిపై మహిళ వరుస అత్యాచారాలు.. చివర్లో కిలేడీ ట్విస్ట్

May 12, 2022

The woman who filed the case against the boy and harassed him

సాధారణంగా అత్యాచారం అంటే మగవారు ఆడవారిపై చేస్తారు. కానీ కాలం మారింది. కొన్ని సార్లు రివర్స్‌లో కూడా జరుగుతుంది. ఓ మహిళ 17 ఏళ్ల మైనర్ బాలుడిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. బాలుడిని బెదిరించి అనేక లాడ్జీలకు తిప్పుకుంది. చివరికి బాలుడికి మహిళ ఒత్తిడి ఎక్కువై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు మహిళ ఒక్కసారిగా రివర్స్ అయింది. తిరిగి బాలుడు, అతని కుటుంబసభ్యులపై కేసు పెట్టింది. చివరికి పోలీసులు నిజం వెలికితీయడంతో కటకటాల వెనక్కి వెళ్లింది.

ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధారావి ప్రాంతానికి చెందిన మహిళకు ఫేస్ బుక్‌లో బీహార్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు. కొంతకాలానికి నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో మహిళ లైంగికంగా వేధించడంతో బాలుడు ఆమెన బ్లాక్ చేశాడు. అనంతరం బాలుడు కొద్ది కాలానికి ముంబైలోని బంధువుల ఇంటికి ఉద్యోగం కోసం వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. సర్లే ఒకసారి వెళ్లొద్దాం ఇంటికే కదా అని తలచి బాలుడు మహిళ ఇంటికి వెళ్లగా మహిళ అతడిపై అత్యాచారానికి పాల్పడింది.

ఈ విషయం ఎవరికైనా చెబితే ఉల్టా కేసు పెడతానని బెదిరించింది. దీంతో భయపడిన బాలుడు విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన మహిళ పదే పదే బాలుడిని పిలుచుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. ఇందుకోసం పలుమార్లు అనేక లాడ్జీలకు తీసుకెళ్లింది. చివరికి విసుగు చెందిన బాలుడు విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు మహిళను పిలవగా, ఆమె రివర్స్ అయి తిరిగి వారిపైనే కేసు పెట్టింది. దీంతో లోతుగా విచారించిన పోలీసులకు అసలు సంగతి తెలిసింది. బాలుడితో మహిళ ఫోన్ సంభాషణలు అన్నీ పరిశీలించిన తర్వాత మహిళను నిందితురాలిగా భావించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.