The woman who lost 14 teeth..do you know why?
mictv telugu

14 పళ్లను రాలగొట్టుకున్న మహిళ..ఎందుకో తెలుసా?

July 22, 2022


బ్రిటన్‌ దేశానికి చెందిన ఓ మహిళ ఏకంగా పద్నాలుగు పళ్లను తనకు తానే రాలగొట్టుకుంది. ఇంకా ఎనిమిది పళ్లను రాలగొట్టుకోవడానికి ఆమె సిద్దంగా ఉంది. ఆ మహిళ చేస్తున్న పని గురించి తెలిసి, ఆమెకు చికిత్సను చేయించడానికి స్థానిక కౌన్సిలర్‌ కాటీ పార్కర్‌ అనే వ్యక్తి 1500 పౌండ్ల విరాళాలను సేకరించే పనిలో పడ్డాడు. చివరికి ఆసుపత్రిలో చేరినా ఆమె తన పళ్లతో ఎన్ని సమస్యలను అనుభవించిందో తెలియజేస్తూ, కన్నీరు మున్నీరు అయ్యింది. ఇంతకీ ఎవరు ఆ మహిళ? ఎందకు పళ్లను రాలగొట్టుకొంది? కారణం ఏంటీ? అనే వివరాల్లోకి వెళ్తే..

బూరి సెయింట్స్ ఎడ్మండ్స్‌కు చెందిన డేనియల్ వాట్స్ అనే 42 ఏళ్ల మహిళ చాలా కాలంగా చిగుళ్ల వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆమెకు పరిచయం ఉన్న ఓ స్థానిక ఎన్‌హెచ్‌ఎస్‌ డెంటిస్ట్‌‌ను సంప్రదించింది. కొన్ని రోజులపాటు అతడిచ్చిన మందులకు కొంచెం కొంచెంగా నొప్పి తగ్గటం మొదలైంది. ఇంతలోనే ఆ డెంటిస్ట్‌ తన‌ క్లినిక్‌ను పూర్తిగా మూసివేశాడు. దాంతో ఆమెకు చికిత్స చేసే వారు లేక మందుల ఇచ్చేవారు లేక నానా అవస్థలు పడింది. చిగుళ్ల నొప్పి రోజురోజుకు ఎక్కువ అవడంతో బాధ తట్టుకోలేక పెయిన్‌కిల్లర్స్‌ తీసుకుంటూ కొన్నాళ్లపాటు కాలం గడిపింది. కానీ, తన పిల్లలు కనిపిస్తే నవ్వలేక, కనీసం తెలిసివారితోనూ సరిగా మాట్లాడలేక తీవ్ర మనస్తానికి గురైంది. ఇక చేసేది ఏమిలేక తన పళ్లను తానే రాలగొట్టుకోవటం మొదలుపెట్టింది. ఒకదాని వెంట మరోకటిగా రాలగొడుతూ, మొత్తం 14 పళ్లను రాలగొట్టుకుంది.

విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్‌ కాటీ పార్కర్‌ ఆమె పరిస్థితి గమనించి, ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”డేనియల్ వాట్స్ కోసం 1500 పౌండ్లు విరాళాలు సేకరించే పనిలో పడ్డాను. డేనియల్ కోసం విరాళాలు సేకరించటం సంతోషంగా ఉంది. కానీ, ఆమె ఇందుకు ఒప్పుకోదు కానీ, చేయక తప్పదు. ఆమె కోసం విరాళాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ విషయం తెలిసి ఆమె కన్నీటిపర్యంతమయ్యింది” అని ఆయన అన్నారు.

అనంతరం ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో ఆమె వైద్యం చేసుకునేందుకు మైడెంటిస్ట్ వద్ద అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. పరీక్షలు చేసిన వైద్యులు.. ఆగస్టు మధ్యలో పాడైపోయిన నాలుగు దంతాలను తొలగిస్తామన్నారు. మిగిలిన నాలుగు మరుసటి రోజున తీసేస్తామని తెలిపారు. ‘అవును, నా పళ్లు ఎలాగైనా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, ఇకపై వాటిని నేను తొలగించుకోనూ. పళ్లు లేకుండా, సమాజంలో తిరగలేకపోతున్నా’ అని డేనియల్‌ మనస్తాపం చెందింది.