పెట్రోల్ బాంబు వేసిన మహిళ.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

పెట్రోల్ బాంబు వేసిన మహిళ.. వీడియో వైరల్

March 30, 2022

bgcc

ఓ మహిళ ఉగ్రవాది పెట్రోల్ బాంబు విసిరిన ఘటన జమ్మూకశ్మీర్‌లో కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర కాశ్మీర్‌, బారాముల్లా జిల్లా, సోపోర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం బురఖా ధరించి, ఓ మహిళ సీఆర్పీఎఫ్ నాకాపై పెట్రోల్ బాంబు విసిరింది. దీంతో ఒక్కసారిగా CRPF సీఆర్పీఎఫ్ క్యాంపులో మంటలు చేలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణిహాని జరగకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, కశ్మీర్‌లో మహిళలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే, ఈ ఘటనతో అక్కడి పోలీసు అధికారులు నిఘాను మరింత పటిష్టం చేశారు.

 

అయితే, ఆ మహిళ బాంబును విసిరివేస్తున్న వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ బ్యాగ్ నుంచి పెట్రోల్ బాంబులు తీసి, విసిరినట్లు కనిపించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ మహిళ లష్కరే తోయిబాతో సంబంధం ఉందని కశ్మీర్ ఐజిపి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”గుర్తించిన మహిళను పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. త్వరలోనే ఆమెను అరెస్టు చేస్తాం. బంకర్‌పై దాడి చేసిన ఈ మహిళ, లష్కరే తోయిబా గ్రౌండ్ వర్కర్, వారిపై ఇప్పటికే చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి” అని ఆయన తెలిపారు.