The woman who slapped French President Macron on the cheek
mictv telugu

దేశాధ్యక్షుడి చెంప ఛెళ్ళుమనిపించిన మహిళ.. వీడియో

November 22, 2022

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కి మరోసారి అవమానం ఎదురైంది. ఓ మహిళ అందరూ చూస్తుండగా చెంప మీద కొట్టింది. అధిక ధరలు, నిరుద్యోగం అరికట్టడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ దాడి చేసింది. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆమెను పక్కకి లాగి అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆ మహిళకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. డ్రోమ్ ప్రాంతంలోని టైన్ ఎల్ హెర్మిటేజ్ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. బారియర్ కి అటువైపు ఉన్న ప్రజలతో మాక్రాన్ మాట్లాడుతుండగా, గుంపులో ఉన్న సదరు మహిళ ముందుకు వచ్చి దాడి చేసింది. ఈ హఠాత్పరిణామానికి మాక్రాన్ షాకవుతూ అలా గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. ఇదంతా వీడియోలో రికార్డవడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే మాక్రాన్ పై దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కరోనా సమయంలో నిర్వహించిన ఓ ర్యాలీలో కూడా మాక్రాన్ పై దాడి జరిగింది. ఓ యువకుడు చెంప మీద కొట్టడంతో అతడిని అదుపులోకి తీసుకొని నాలుగు నెలలు జైలు శిక్ష విధించారు.